Home » Tag » Andhra Politics
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్ సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతోంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడుతున్నారు.
తెలంగాణలో రాజకీయం (Telangana Politics) చేయాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. TRS పుట్టినప్పటి నుంచి ఇదే ఫార్ములాపై మనుగడ సాగిస్తోంది. ఎప్పుడు పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వాళ్లని కించపరచడం, మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టడం... కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ అలవాటైన విద్య. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. TRS బీఆర్ఎస్ (BRS) గా మారిపోయింది.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా నిరసన తెలపొచ్చు. ఎక్కడో విదేశాల్లో జరిగే ఘటనలపై భారత్ లో నిరసనలు తెలిపే అవకాశం కల్పిస్తున్నప్పుడు.. పొరుగునే ఉన్న రాష్ట్రంలో జరిగిన నిరసనకు హైదరాబాద్ లో నిరసన తెలపకుండా అడ్డుకోవడం న్యాయం కాదు.
అవే మాటలు..అవే మాయలు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన మార్కు రాజకీయంతో అందరినీ బోల్తా కొట్టించారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన బిల్డప్ చూస్తే స్టీల్‌ప్లాంట్‌ను సింగరేణి కొనేసినట్లు, దానికి కేసీఆర్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని పేరు కూడా పెట్టినట్లు అనిపించింది. తీరా చూస్తే ఏముంది ఫైనల్‌గా అందరి చెవిలో పూలు పెట్టేశారు కేసీఆర్.
వైసీపీకి వరుసగా రెండో షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఝలక్‌తో వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. 23 ఓట్లతో గెలిచారు.