Home » Tag » Andhra Pradesh Elections
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైయింది.
మెగా ఫ్యామిలీ (Mega Family) లో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ (Allu Arvind) ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగా కుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది.
మరో వారంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ (TDP) ఆధ్వర్యంలోని NDA కూటమి (NDA Alliance) అధికారంలోకి రాబోతోంది. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.
ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ... కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు.... తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్‌లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.
మెగా ఫ్యామిలీ (Mega Family) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (Andhra Pradesh Elections) సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది.
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు, చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అలాంటిదే జరగబోతుందా అనే అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ (Andhra Pradesh Elections), లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో... అధికారం చేపడుతుందో లేదో తెలియదు గానీ... ఇప్పుడు రాజ్యసభలో మాత్రం టీడీపీ తీవ్ర అవమానం ఎదుర్కుంటోంది. ఏపీలో జరిగే 3 రాజ్యసభ ఎన్నిక (Lok Sabha Elections) ల్లో...సరైన బలం లేకపోవడంతో టీడీపీ (TDP)తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదు. దాంతో 41యేళ్ళ చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యుడు లేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గరపడుతున్నవేళ... అన్ని పార్టీల అధినేతలు వరుసగా ఢిల్లీకి (Delhi) క్యూ కడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... బీజేపీ (BJP) తో పొత్తుల కోసం ఢిల్లీకి వెళితే... ఉన్నట్టుండి ఏపీ సీఎం జగన్ (CM Jagan) కూడా హస్తిన ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (Andhra Pradesh Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో పొలిటికల్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే యాత్ర 2(Yatra 2), వ్యూహం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఆర్జీవీ, జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడం తో అది కోర్టులో విడుదలకు ఎదురుచూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతుంది. ఇక యాత్ర 2 తోనే తానూ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్ ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నడూ లేనంతగా గత పదేళ్ళుగా చాలామంది పొలిటికల్ లీడర్లు (Political Leaders) తిట్లతోనే బతికేస్తున్నారు. ప్రతి రోజూ మీడియాలో ప్రత్యక్షమై.. బూతులు తిడుతూ రికార్డులు సాధిస్తున్నారు. గతంలో ఏ వ్యక్తిపై అయినా పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడైతే కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగి మరీ తిడుతున్నారు. ఇందులో సీఎం జగన్ కూడా ముందు ఉంటున్నారు.