Home » Tag » Anitha
ఏపీ హోం మంత్రి అనిత పి ఏ జగదీష్ ని తొలగించడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు అనిత పిఏను అవినీతి ఆరోపణలపై తీసేశారు అని అంటున్నారే తప్ప.... ఏ అవినీతి చేశాడు, ఎంత తిన్నాడు?
మేడం గారి కంటే పిఏ గారిది ఎక్కువ హవా.. మంత్రి గారిని ఎవరు కలవాలి.. ఎప్పుడు కలవాలి.. ఎక్కడ కలవాలి.. ఎవరెంత కమిషన్ తీసుకురావాలి.. ఇలా ఎన్నో విషయాల్లో అసలు మంత్రిగారి ప్రమేయం లేకుండానే పిఏ గారి డామినేషన్ ఉంటుంది.
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై హోం మంత్రి అనిత ముందే హెచ్చరించారా ? తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్నపుడే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారా ?
విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పోలీసులు ఇప్పుడే పోలీసుల పాత్ర పోషిస్తున్నారన్నారు.
సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరమని ఎద్దేవా చేసారు. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలో 28శాతం నేరాలు తగ్గాయన్నారు.
వంగలపూడి అనిత ప్రెస్ మీట్
చంద్రబాబు అరెస్ట్ తో అటు టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మన్న రోజాపై మాజీమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. బండారును అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ తరుణంలో అనిత ప్రెస్ మీట్ పెట్టి రోజా, పద్మలపై మాట్లాడారు.
అనితా.. ఓ అనితా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఈ పాట రాసింది ఎవరో తెలియకున్నా.. ఆ పాట మాత్రం ఇంతింతై వటుడింతై దానిపైనంతై అన్నట్లుగా ఖండాలు, దేశాలు, ఎల్లలు దాటి వెళ్లిపోయింది. బహు ప్రాశస్థ్యం పొందింది. ఆపాట వినేందుకు ఎంత కమ్మగా ఉన్నా.. దాని వెనుక మాత్రం కనిపించనంత శోకం దాగి ఉంది. ఆ శోకపు జ్వాల చల్లారకముందే.. కాలం మరో రూపంలో సుడిగుండాల హోమానికి ఆజ్యం పోసింది. ఇంకేముంది ఈ పాటకు జీవంపోసిన అతని జీవితంలో అనేక ప్రచండ శక్తులు తోడయ్యాయి. దీంతో యుద్దం చేసేందుకు అస్త్రాలు నాగరాజు దగ్గర లేవు. అటు ప్రేమించిన మహిళ.. ఇటు నమ్ముకున్న కళ.. ఇతని జీవితాన్ని కకావికలం చేసింది. ఈ విషాద సాగరం నుంచి కోలుకొని హూస్సేన్ సాగర్ తీరాన ఉన్న హైదరాబాద్ లో తిరిగి నివసిస్తూ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అనిత ప్రేమాయణం నుంచి సగటు జీవి సాధారణ ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో అనిత పార్ట్ 2 అంటూ సరికొత్త లిరిక్స్ తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు సిద్దం అయ్యారు. ఈ మట్టిలో మాణిక్యం ఇన్నాళ్లు ఏమైపోయారు.. అసలు ఈ లవ్ స్టోరీ ఏంటి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు.. అనే మొత్తం వివరాలు చదివేద్దాం.
జగన్ ప్రభుత్వం పై అనిత మండిపడ్డారు.