Home » Tag » Antibiotics
ఈమధ్యకాలంలో యాంటీ బయోటిక్స్ (Antibiotics) వాడకం బాగా ఎక్కువైపోయింది. కరోనా (Corona) తర్వాత ప్రతి చిన్న రోగానికి డాక్టర్లు యాంటీ బయోటిక్స్ రాసేస్తున్నారు. పేషెంట్లు కూడా వాటికి బాగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల వైరస్ (Virus), బ్యాక్టీరియలు (Bacteria) వీటికి అలవాటు.. చివరకు మందులు పనిచేకుండా పోతున్నాయి. అందుకే ఇలా యాంటీ బయోటిక్స్ వాడకంపై కేంద్రం నిబంధనలు (Center regulations) కఠినతరం చేసింది.
సమీప భవిష్యత్తులో యాంటీ బయాటిక్స్ పనిచేయడం మానేయబోతున్నాయి. యాంటీబయాటిక్స్ తీసుకున్నా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. త్వరలో ప్రపంచం ఎదుర్కోబోతున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఇదే కాబోతోంది.
ఇప్పుడు ప్రతి చిన్న రోగానికీ యాంటిబయోటిక్స్ వాడడం అలవాటైపోయింది. డాక్టర్లను సంప్రదించకుండానే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటిబయోటిక్స్ తెచ్చి వాడేస్తున్నారు. అయితే వాటి వల్ల ఎంత ప్రమాదమో తెలియ జేస్తున్నారు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ యం.వి.రావు.