Home » Tag » AP BJP
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా ... ఇండియా కూటమితో జత కలుస్తారా... అన్నది సస్పెన్స్ గా మారింది.
బీజేపీ, జనసేన సాయంతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ. కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటోంది. మూడు పార్టీల నేతలు కలసి కట్టుగా పనిచేస్తున్నారు.
ఇప్పటికే రైల్వేకోడూరులాంటి అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని మార్చిన జనసేన.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఏలూరులాంటి స్థానంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
పొత్తులో భాగంగా ఏపీలో 175 స్థానాలకుగాను బీజేపీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. బుధవారం సాయంత్రం ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ దక్కించుకోవడం కీలక పరిణామం.
ఈ జాబితాలో పార్టీ కోసం అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం అని చెప్పుకునే నేతలకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్లు డీలా పడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యంగా సోమువీర్రాజు, జీవీఎల్, మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ లాంటి వారి పేర్లు లిస్ట్‌లో లేవు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. రాష్ట్ర విభజన కోపంతో అక్కడి జనం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకు కారణమైన మరో పార్టీ బీజేపీది కూడా దాదాపు అదే పరిస్థితి. కాకపోతే వ్యక్తి ఇమేజ్ కారణంగా, మోడీ మేనియాతో... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తారేమో.... ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారేమో.... దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతారేమో.... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ నేతలు కౌన్సిలర్ గా కూడా గెలవలేరు. ఇది ఏపీలో బిజెపి నేతల దుస్థితి.
ఏపీలో ఎన్నికల హడావుడి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ఎలక్షన్స్‌లో పోటీ చేసి బొక్కబోర్లా పడింది జనసేన. సీట్ల సంగతి తర్వాత కనీసం ఓట్లు కూడా సరిగా పడలేదు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.
తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయడం ద్వారా ఏపీ బీజేపీలోనూ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాల్ని అధిష్టానం పంపింది. ఏపీకి ఇటీవలే సోము వీర్రాజును తొలగించి, పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
బండి హయాంలోనే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ముందుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ బాధ్యతలు బండి సంజయ్‌కు అప్పగించాలని డిసైడైనట్లు సమాచారం.