Home » Tag » AP CM YS Jagan
2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ (GHMC) ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉండదు. పదేళ్ళ కాల పరిమితి పూర్తవుతోంది. అందువల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ సర్కార్ కి వెళ్ళిపోతాయి.
బూతులు తిట్టుకోవడం, హద్దులు మీరి మాట్లాడటం, ఒకరినొకరు గేలి చేసుకోవడం ఇదే రాజకీయమా.? అడ్డగోలుగా మాట్లాడేవారికి అవతల పార్టీ నేతలను నీచాతినీచంగా తిట్టేవారికి అన్ని పార్టీల్లోనూ డిమాండ్ పెరిగిపోతోంది. నోరేసుకుని ఎగబడిపోవడమే క్వాలిఫికేషన్. బాగా తిట్టడం వస్తే చాలు రాజకీయం తెలిసినట్లే. ఈ ఫార్ములా మీదే ఇప్పుడు చాలా మంది నేతలు బతికేస్తున్నారు.
ఇప్పటికైనా బుగ్గన మౌనం వీడి ఏపీ అప్పులపై స్పందిస్తే బాగుంటుంది. 10లక్షల కోట్లు ఏమయ్యాయన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఆయన చెబితేనే సరిగ్గా ఉంటుంది. వాళ్లూ వీళ్ల కన్నా ఆయన సమాధానమే ముఖ్యం. మరి ఇంతకీ బుగ్గన దీనిపై స్పందిస్తారా...? మనకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటారా...? లేక వైసీపీ పెద్దల ఆదేశాలతో తూతూ మంత్రంగా స్పందించి సైడైపోతారా...?
టమాటాలు దేశీయ మార్కెట్లో రూ. 300 చేరువవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు టమాటాలు ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో టమాటాలు రూ. 50 కే ఇస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు రెండుకిలోమీటర్ల మేరా క్యూ కట్టారు. వీటి ధరలు మరో నెల రోజుల పాటూ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ గురించి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రతీ అడుగులు, ప్రతీ విజయంలో విజయసాయి కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఉండకూడదు కూడా ! పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా.. రాజకీయ అనుభవం లేకపోయినా.. రాజకీయం తెలియకపోయినా.. వైసీపీని సక్సెస్ఫుల్ పార్టీగా నిలబెట్టడంలో విజయసాయిది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తే.. దాన్ని నడిపించడంలో విజయసాయికి వందకు 150 మార్కులు పడ్డాయ్.
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది ఏపీ రాజకీయం. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ విషయం వివాదంగా మారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీన్ మరింత మారింది. వివేకా కేసులో వైఎస్ కుటుంబం చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. పక్కా క్లారిటీతో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలు, పవన్‌తో చంద్రబాబు మీటింగ్.. ఇలాంటి పరిణామాలన్నీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి.
ఎన్నికలు అంటేనే వ్యూహాలు.. ప్రతివ్యూహాలు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక పార్టీ తన బలాలపై దృష్టి పెడితే సరిపోదు. ప్రత్యర్థి బలహీనతల మీదా దెబ్బకొట్టాలి. ఈ పని చేయడంలో ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ దిట్ట. ప్రతిపక్ష టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసురుతూ తన వ్యూహంలో చిక్కుకునేలా చేయడంలో జగన్ ముందుంటారు. ప్రతిపక్షాల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని ఓడించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్ చేసే దుష్ప్రచారాన్ని సభా ముఖంగా ప్రజల సాక్షిగా తిప్పికొట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షనేతల చేష్టలను ఎండగట్టిన ముఖ్యమంత్రి.
వివేకానంద రెడ్డి కేసులో విచారణ వేగం పుంజుకుంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను 25తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్.