Home » Tag » AP Lok Sabha Elections
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ఫలితాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై నేషనల్, రీజినల్ సర్వేలు రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ (Exit polls) బయటపెట్టాయి.
అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసీపీ… వరుస లిస్టులను విడుదల చేస్తోంది. లోకల్, క్యాస్ట్, కాంబినేషన్... ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వడపోతలు నడుస్తున్నాయి. సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు జరిగాయి. సర్వేల ఆధారంగానే ముందు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినా... కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పుంజు కోలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో పెరుగుతోందట.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... వైసీపీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. కానీ టీడీపీ - జనసేన (TDP-Janasena) కూటమి నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి లిస్ట్ బయటకు రాలేదు. అయితే గత రెండు రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి... పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముందుగా ఎంపీ స్థానాలపై ఆయన దృష్టిపెట్టినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లోని నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే(Nagari MLA), రాష్ట్ర మంత్రి రోజాకు (Roja) ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరిలో ఆమెకు వర్గ పోరు తీవ్రంగా ఉంది. ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాల ఇంఛార్జులు, ముఖ్యనేతలు రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వర్గాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddi Reddy Ramachandra Reddy) సపోర్ట్ కూడా ఉండటం.. ఆమె సీటుకు ఎసరు పెట్టేలా ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) మరోసారి విజయం సాధించడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan).. వరుసగా నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్నారు. ఇప్పటికి నాలుగు లిస్టులు విడుదల చేశారు. వీటిల్లో మొత్తమ్మీద 68 మంది దాకా ఎంపీ, ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులు, చేర్పులు జరిగాయి. ఇంకా కొన్ని జిల్లాల సంగతి తేలలేరు. దాంతో ఇంకో లిస్ట్ ఉంటుందా.. తమని కూడా మారుస్తారా ? అని టెన్షన్ లో ఉన్నారు కొందరు వైసీపీ నేతలు.