Home » Tag » AP PCC CHIEF
వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు.
పిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడలేనివాళ్లు రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటంటూ ప్రశ్నించారు. తెనాలిలో ప్రతీ ఒక్క మహిళ ఈ విషయంలో ఆలోచించాలంటూ పోస్ట్ చేశారు.
రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ కోసం కేంద్రం అనేక హామీలు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. అయితే, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పెద్దగా దృష్టి పెట్టలేదని, రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని షర్మిల గుర్తు చేశారు.
ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC chief) గా బాధ్యతలు అందుకున్న షర్మిల (Sharmila) .. తగ్గేదే లే అంటున్నారు. పగ్గాలు అందుకున్న రోజు కాస్త పర్వాలేదనిపించిన షర్మిల మాటలు.. జగన్ టార్గెట్‌గా రోజురోజుకు ఘాటెక్కుతున్నాయ్. వైసీపీ (YCP) కూడా దీటుగా కౌంటర్ ఇస్తోంది అది వేరే విషయం. షర్మిలను వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో.. ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ.. ఆమె ఐడియాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయ్.
తెలంగాణలో పార్టీని మూసేసి కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించినప్పటి నుంచి రేవంత్, షర్మిల మధ్య బాండింగ్ చాలా హెల్దీగా మారిపోయింది. ఎంత హెల్దీగా అంటే.. షర్మిల తన కొడుకు పెళ్లికి రేవంత్‌ను ఆహ్వానించేందుకు స్వయంగా తన ఇంటికి వెళ్లింది.