Home » Tag » AP PENSIONS
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వం క్రమంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఎప్పుడూ ఒకటో తేదీనే ఇంటికి పింఛన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్దారులు సచివాలయాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్లి పలువురు మరణించారు
పింఛన్ల కోసం వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురై ఇద్దరు వృద్ధులు మరణించారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనికి కారణం.. టీడీపీయే అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఎట్టకేలకు ఇవాళ ఫించన్లు పంచడం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. కానీ అదే.. ఇద్దరు వృద్ధుల పాలిట మృత్యువుగా మారింది. పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎండదెబ్బ తగలడంతో ఇద్దరు వృద్ధులు చనిపోయారు. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
మూడు రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ.. ఎండలు మండిపోతున్న సమయంలో వృద్ధులు నానా అగచాట్లు పడుతూ పెన్షన్లు తీసుకోవడం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బే. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.