Home » Tag » AP Tourism
విజయవాడ కృష్ణానదిలోని పున్నమి ఘాట్లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు. వేసవిలో భాగంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పిల్లలకు బోటింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.
విహారం అనగానే ప్రతి ఒక్కరిలో ఒక వింత అనుభూతి చోటు చేసుకుంటుంది. అక్కడి ప్రదేశం ఎలా ఉంటుందో.. సౌకర్యాలు ఉంటాయో లేదో.. ఉండేందుకు వసతులు ఏమేరకు దొరుకుతాయో.. ఆప్రాంతంలో ఫుడ్ ఏమి దొరుకుతుందో.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో.. అని అక్కడకి వెళ్లి చూసేకంటే ముందే ఇన్ని ప్రశ్నలతో చిన్నపాటి ప్రశ్నాపత్రాన్ని మన మైండ్లో సేవ్ చేసుకుంటాం. వాటికి సమాధానాలు దొరికే వరకూ అన్వేషిస్తూనే ఉంటాం. అలా కాకుండా సెలబ్రిటీ స్థాయి సౌకర్యాలతో విహారయాత్ర పూర్తి చేసుకుంటే.. అబ్బ ఆ అనుభూతి ఊహకు అందడం లేదు. వర్ణించేందుకు పోలికలు తూగడంలేదు కదూ. అందుకే ఇలాంటి వింతైన భావనను మనకు కలిగించాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం లోని టూరిజం శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విశాఖ నగరాన్ని సుందరీకరణలో భాగంగా ఇలా పెయింటింగ్ లతో పుట్ పాత్ గోడలను అలంకరించారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.
విశాఖ సాగర తీరం వేదికగా జీ20 సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో విందు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.