Home » Tag » Apple
ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది.
ఇజ్రాయెల్ NSO గ్రూప్‌నకు చెందిన పెగాసెస్ నుంచి ఈ స్పైవేర్ రిలీజ్ అయింది. భారత్ సహా 92 దేశాల్లోని యూజర్ల యాపిల్ ఐడీలకు వార్నింగ్ మెస్సేజ్‌లు, మెయిల్స్ కూడా పంపింది యాపిల్ సంస్థ. గతంలో కూడా పెగాసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చింది.
కోవిడ్ పాండెమిక్ తర్వాత యాపిల్ ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి. అనేక కంపెనీలు గతంలో వేల సంఖ్యలో ఎంప్లాయిస్ను తీసేసినా.. యాపిల్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా తొలగించలేదు.
కేజ్రీవాల్ పాస్వర్డ్స్ చెప్పడం లేదు. అయినప్పటికీ ఐఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.
అమెరికా యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించి, మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం యాపిల్ ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఇతర పోటీ కంపెనీలను దూరంగా ఉంచడం, ధరలను నియంత్రించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా ఐఫోన్ పగలలేదు. ఈ ఘటన ఈ నెల 5న జరిగింది. గత శుక్రవారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది.
ఐఫోన్ 15 తోపాటూ యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈవెంట్ వేదికగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఉత్పత్తులు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఇది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా నిలిచింది. 2030 నాటికి తమ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పర్యావరణహితంగానే ఉంటాయని తెలిపారు. అలాగే ఈ ఐఫోన్స్ కి తొలిసారిగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకురానున్నారు.
యాపిల్ కంపెనీ ఎట్టకేలకు ఐఫోన్ 15 మోడల్స్ పూర్తి వివరాలతో పాటూ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే తేదీని ప్రకటించింది. వీటి ధరను కూడా వెల్లడించింది.
యాపిల్ సంస్థకు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది.
ఐఫోన్ పట్టుకుని పడుకోవడం, లేదా పక్కన ఉంచుకుని నిద్రపోవడం చేయకూడదని ఐఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అందులోనూ ఫోన్ చార్జింగ్ పెట్టి, దగ్గర అస్సలు పడుకోకూడదని సూచించింది. ఇదేమీ కొత్త హెచ్చరిక కాదు.