Home » Tag » armoor
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి.. ఎంపీ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. గత ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది బీఆర్ఎస్.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. తమ దగ్గర తీసుకున్న రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆర్మూర్ నడి బొడ్డున ఉన్నవిలువైన ఆర్టీసీ స్దలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ నిర్మించారు. ఆ మాల్లో బడా కంపెనీలకు లీజ్‌కు ఇచ్చి లక్షల్లో అద్దెలు తీసుకుని.. ఆర్టీసీకి స్ధలం అద్దె చెల్లించడంలేదు.
రియర్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన జీవన్ రెడ్డి.. రీసెంట్గా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను మెన్షన్ చేశారు. తన పేరుమీద, తన కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు ప్రచార వ్యాన్ ఎక్కారు. కానీ ఆ వ్యాన్ రెయిలింగ్ చాలా వీక్‌గా ఉంది. అంతమందిని తట్టకునే కెపాసిటీ రెయిలింగ్‌కు లేదు. ఈ విషయాన్ని నేతలు ముందుగా గుర్తించలేదు.