Home » Tag » Ashwini Vaishnaw
ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.
ఇప్పటి వరకూ హౌరా ట్రైన్ పట్టాలు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం చేశారు. హౌరా ట్రైన్‌ను కోరమాండల్ ఢీ కొడితే.. కోరమాండల్ ట్రైన్‌ను గూడ్స్ ఢీ కొట్టిందని చెప్పారు. కానీ ప్రమాదానికి అసలు కారణం సిగ్నలింగ్, కమ్యూనికేషన్ లోపం. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ కూడా తెలిపింది.
దేశంలో రైలు ప్రమాదాల్ని సున్నా స్థాయికి తగ్గించడానికి.. అంటే అసలు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీకి ఎస్ఐఎల్4 సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందంటే.. 10,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంటుంది.