Home » Tag » Assembly Elections 2023
అఫిడవిట్లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొన్నారు. రేవంత్ తన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రఆయనపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఎక్కడా దోషిగా తేలలేదు. రేవంత్ వద్ద రెండు తుపాకులు, రెండు కార్లు ఉన్నాయి.
రకరకాల కారణాలతో జనంలో ఆగ్రహం ఉన్న మాట వాస్తవం. ఐతే దీని తీవ్రత ఇంత ఉంటుందని కేసీఆర్ ఊహించలేదు. డ్యామేజ్ కంట్రోల్‌కి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణ రోజుల్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకని కొందరు నాయకులను ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి.. తెలంగాణవ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో గట్టిపట్టు ఉంది. దీంతో ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు అనేక ఆఫర్లు ఇచ్చాయ్. ఐతే బీఆర్ఎస్లో చేరాలని కాసాని నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కని కొందరు నేతలు కూడా.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమకు టిక్కెట్లపై హామీ ఇస్తే.. వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు వీళ్లంతా సిద్ధంగా ఉన్నారు.
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. భైంసా, బాసర జడ్పీటీసీలు.. ఓ ఎంపీపీ.. 10 మంది సర్పంచ్‌లు.. 8 మంది ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు.
మొదటి జాబితాలో బీజేపీలోని సీనియర్ నేతలు, బలమైన నేతల పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఎలాంటి వివాదం లేని అభ్యర్థుల జాబితాను మొదట వెల్లడిస్తారు. ఆ తర్వాత మిగతా అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఆ వెంటనే మేనిఫెస్టో అనౌన్స్ చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను తలదన్నెలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని.. జనాల దృష్టి తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
రాజస్థాన్ లో ఈ సారి ఆనవాయితీ కొనసాగుతుందా..? ఐదేళ్లకొకసారి అధికారం మారే తీరుకు ఓటర్లు స్వస్తి పలకనున్నారా..? రాజస్థాన్ పూర్తి రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం.