Home » Tag » Assembly Polls
ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.
ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న పార్టీలు బిహార్‌లో అధికారంలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాయి. అలాంటప్పుడు ఇదే కూటమికి చెందిన ఆప్ కూడా తాము బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి అనువైన సూచనల్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు సునీల్. ఆయన వ్యూహాల ప్రకారం.. ఎస్సీలు, బీసీల సాధికారత, రైతు పంట రుణ మాఫీ వంటి అంశాల్ని ప్రజల్లోకి కీలకంగా తీసుకెళ్లబోతున్నారు.
ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమాచారంతో ఐటీ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఓ రాజకీయ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
కర్నాటకలో బీజేపీ పరిస్థితి ఏమంత గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది నేతలు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు స్వచ్చంధంగా విరమణ పాటిస్తున్నారు. మరికొందరు రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అనేక సమస్యలు కర్నాటక బీజేపీని వేధిస్తున్నాయి.