Home » Tag » australia
ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడనున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ మెగావేలంలో పాల్గొనేందుకు జెడ్డా వెళుతున్నాడు.
ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేసర్ల పండుగ...బౌన్సీ పిచ్ లపై ఆసీస్ పేసర్లు విసిరే బంతులు బుల్లెట్ల కంటే వేగంతో వస్తుంటాయి.. వాటిని కాచుకుంటూ క్రీజులో నిలవడం అంత ఈజీ కాదు.. అందుకే విదేశీ జట్లకు ఇక్కడి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కఠిన సవాల్ గానే ఉంటుంది.
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా మూడురోజుల టైముంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్ను తొలి టెస్టుతో ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేవనుంది. మూడోసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకుంటున్న టీమిండియాకు కొన్ని ఊహించని చిక్కులు ఎదురయ్యాయి.
ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతుందంటే ఆటతో పాటు స్లెడ్జింగ్ కూడా ఖఛ్చితంగా ఉంటుంది...అసలు ఆట కంటే ముందు మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ళను దెబ్బతీయడమే కంగారూల వ్యూహం.. గత కొన్నేళ్ళుగా మైదానంలో వారికిది సర్వసాధారణంగా మారిపోయింది.
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన పాకిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం ఘోరపరాజయం పాలైంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయి క్లీన్ స్వీప్ పరాభవాన్ని చవిచూసింది.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి... ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే... క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తలపట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఆస్ట్రేలియా టూర్ లో మరోసారి ఆధిపత్యం కనబరచాలనుకుంటున్న టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే సమస్యలు వెంటాడుతున్నాయి. రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ కు ఊహించని షాక్ తగిలింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా కసరత్తు మొదలైంది. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కంగారూ గడ్డపై అడుగుపెట్టిన భారత్ దానికి తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీక్రేట్ గా ప్రాక్టీస్ చేస్తోంది.
సొంతగడ్డపై పాకిస్థాన్ తో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 29 పరుగుల తేడాతో పాక్ ను ఓడించింది.