Home » Tag » Auto Drivers
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితంగా ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆటో డ్రైవర్లు భారీగా నష్టపోతున్నారు. తమ జీవనోపాధి కరువైందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు AICC అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా వారికి రూ.5లక్షల ప్రమాద బీమాను కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్కీమ్ వర్కింగ్ జర్నలిస్టులు, ట్రాన్స్ పోర్ట్, నాన్ ట్రాన్స్ పోర్ట్, ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు కూడా వర్తిస్తుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్.. పలు హామీలిచ్చారు.
తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.
పనిగంటలు పాటించకుండా ... రోజుకి 11 గంటల పాటు వర్క్ చేస్తున్నా తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ తమ గోడు చెప్పుకున్నారు.
ఆటో డ్రైవర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు..