Home » Tag » AyodhaRamMandir
ఎప్పుడెప్పుడాని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా.. హట్టహాసంగా ఈ భూమిపై ఎన్నడూ జరగని విధంగా అయోధ్య రాములోరి ఆలయ ప్రారంభోత్సవం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరు 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి దాదాపు 130 దేశాల నుంచి అథితులు రాబోతున్నారు.
తెలంగాణ నుంచి అయోధ్య రాముడికి వరుస కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ద్వారాలు, పాదుకలు, భారీ లడ్డూ, ముత్యాలు కానుకగా వెళ్లగా ఇప్పుడు మరో కానుక రాముడి పాదాల చెంతకు చేరబోతోంది. నేతనల్ల పుట్టినిల్లు సిరిసిల్ల నుంచి బంగారంతో నేసిన చీరను రామాలయానికి కానుకగా పంపనున్నారు.
శ్రీరామ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముడి (Ayodhya Bala Rama) విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్లద్వాదశి నాడు 12 గంటల 20 నిమిషాలకు విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. ఈ నిర్ణయంతో మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి(Sculptor) అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఖ్యాతి అయోధ్యకు చేరింది.