Home » Tag » Ayodhya City
శ్రీరాముడి భార్య.. ధర్మపత్ని సీతమ్మ దేవి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం భారత దేశంలో ఉన్న అయోధ్య నగరం నుంచి పవిత్ర నది అయిన సరయూ జలాలు శ్రీలంకకు వెళ్లలున్నాయి.
అయోధ్య (Ayodhya ) లో అద్భుతం జరిగింది. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం (Surya Tilak) .. మరో ప్రపంచంలోకి లాకెళ్లింది భక్తులను. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా.. బాలరాముడికి ఆ సూర్య భగవానుడే తిలకం దిద్దాడు.
అయోధ్యలో ఇవాళ ఓ అద్భుత ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. రామాలయం నిర్మాణం జరిగిన తరువాత మొదటి శ్రీరామ నవమి వేడుకలను అయోధ్యలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాల రాముడికి అలంకరణ, మహా హారతి లాంటి కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం సమయంలో బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని దిద్దిన ఘట్టం చూసి భక్తులు మైమరిచిపోయారు.
శ్రీరామనవమి సందర్భంగా అయోద్యంలో బాలరాముడి ఫోటోస్..
శ్రీరామనవమి (Sri Ramanavami) పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా.. అయోధ్య రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు ముద్దాడాయి.
అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో కోట్లాదిమంది రామభక్తుల కల సాకారం కానుంది. రేపు అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ( Prana Pratishtha) సంబంధించి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. పునర్ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తు న్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది.
అయోధ్య ఈ పేరు తెలియని వారు భహుసా ఉండరేమో.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో శ్రీరాముడికి రామమందిరం కడుతున్న విషయం తెలిసిందే.. కాగా ఈ రామ మందిరానికి వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేకం 1000 రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు భారత రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.