Home » Tag » #Ayodhya Rama Mandir
భారత రాజకీయ చరిత్రలో అయోధ్య అంటే అద్వానీ. అద్వానీ అంటే అయోధ్య. అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చిన నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. ఈరోజు అయోధ్యలో రామాలయం వెలిసింది అంటే ఆ కృషి అంతా 96 ఏళ్ల అద్వానీదే. 80ల నుంచి అయోధ్య అంశాన్ని దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా చేసి అందుకోసం ఉద్యమించి రథయాత్రలు చేసి... ఆందోళనలు చేసి... న్యాయస్థానాల్లో పోరాడి ,నిరంతరం శ్రమించిన నాయకుడు ఎల్ కే అద్వానీ.
అయోధ్యలో(Ayodhya) బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ(Prana pratishtha) కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడానికి పరోక్షంగా బాలీవుడ్ (Bollywood) యాక్టర్ (Actor) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కారణమని తెలుస్తోంది.
500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.
అయోధ్య శ్రీ రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రారంభం అయ్యాయి.
అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేళ మనం ఇంట్లో ఎలా పూజలు నిర్వహించుకోవాలి. ఏయే గ్రంథాలు చదువుకోవాలి.... రాముడికి నైవేధ్యాలు ఎలా సమర్పించాలి...