Home » Tag » Ayodhya Ramaiah
అయోధ్యలో ఇవాళ ఓ అద్భుత ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. రామాలయం నిర్మాణం జరిగిన తరువాత మొదటి శ్రీరామ నవమి వేడుకలను అయోధ్యలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాల రాముడికి అలంకరణ, మహా హారతి లాంటి కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం సమయంలో బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని దిద్దిన ఘట్టం చూసి భక్తులు మైమరిచిపోయారు.
శ్రీరామనవమి సందర్భంగా అయోద్యంలో బాలరాముడి ఫోటోస్..
శ్రీరామనవమి (Sri Ramanavami) పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా.. అయోధ్య రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు ముద్దాడాయి.
అయోధ్యలోని (Ayodhya) శ్రీరామ మందిరంలో (Sri Ram temple) బాలక్ రామ్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కు ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. చూడగానే ఆకట్టుకునేలా... ప్రతి ఒక్క భక్తుడూ తన్మయత్వంతో మురిసిపోయే అద్భుతమైన బాల రాముడిని చెక్కారు శిల్పి యోగిరాజ్ (Yogiraj) … బహుశా... ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో... అని ఆయన అన్నారంటే... అది నిజమే మరి.