Home » Tag » Bail Petition
ఫైబర్ నెట్ కేసు (fiber net case) లో టీడీపీ (TDP) అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టు తీర్పు వెలువడించనుంది. ఈ క్రమంలో ఆయన పై ఇంకో కేసు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఏపీ నుంచి ఢిల్లీ దాకా.. అమరావతి కేసుల మొదలు స్కిల్ డెవలప్మెంట్ కేసుల వరకూ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు వాటి తరఫు వాదనలు ఇవే.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ అనగా సెప్టెంబర్ 24 వరకూ ఆదేశించింది. ఆతరువాత మరో రెండు రోజులు కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో అక్టోబర్ 5 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రేపటితో కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల ఏం జరుగుతుందా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది.
చంద్రబాబు కేసులు జిల్లా కోర్టుల నుంచి హై కోర్టుకు చేరింది. తాజాగా హై కోర్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. దీనిపై ఎక్కడా బాబుకు స్పష్టమైన తీర్పు రాకపోవడంతో అయోమయంలో పడుతున్నారు టీడీపీ శ్రేణులు.
చంద్రబాబు స్కిల్ సహా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్లు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈరోజు ఒక స్పష్టత రానుంది. సుప్రీం కోర్టు మొదలు ఏసీబీ కోర్టు వరకూ అన్ని చోట్ల మంగళవారం చంద్రబాబు కేసులు విచారణకు రానున్నాయి. ఈరోజు చంద్రబాబుకు కీలకంగా మరానుంది.
చంద్రబాబు కస్టడీ పొడిగిస్తారా.. బెయిల్ మంజూరు చేస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ తరఫు లాయర్ గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈనెల 19లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించారు.
చంద్రబాబు కేసులో జరగబోయేది ఇదే.
చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే దారే కనపడటం లేదా.? దీనికి కారణాం ఏంటి..?