Home » Tag » Balapur
హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అన్నదే.హైదరాబాద్ గ్రోత్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది.
హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫేమస్సో.. బాలాపూర్ గణేషుడు లడ్డూ అంతే ఫేమస్. వినాయకచవితి వచ్చిందంటే చాలు.. బాలాపూర్ గణేషుడి లడ్డూ గురించి చర్చ జరుగుతుంటుంది. ఎవ్రీ ఇయర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతుంటాయ్.
11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది.
దేశవ్యాప్తంగా ఎత్తులో ఖైరతాబాద్ పేరు పేరుగాంచిన.. లడ్డూ వేలం పాటలో బాలాపూర్ కి ప్రత్యేక స్థనమే.. ప్రతి సంవత్సరం తన లడ్డు రికార్డు తానే బ్రేక్ చేస్తున్న వాస్తునాడు బాలాపూర్ గణేష్. ఈ సారి కూడా భారీ ధర పలికింది బాలాపూర్ లడ్డూ.. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు.
హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం జరిగింది. ఇందులో బండ్లగూడ ప్రధమ స్థానంలో నిలువగా.. బాలాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మాదాపూర్ లోని మై హోమ్ అపార్ట్ మెంట్లో కూడా లడ్డూ వేలం వేయగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.