Home » Tag » Balasore
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రక్తపు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ జూన్ 18న చనిపోయాడు. అతని మరణంతో మృతుల సంఖ్య 292కు చేరింది. వందల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. చరిత్ర మర్చిపోలేని ఈ దుర్ఘటనపై సీబీఐ జూన్ 6న విచారణ ప్రారంభించింది.
కీలకమైన ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడంతో ప్రమాదం జరిగినట్లు తేలిపోయింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా ? ప్రమాదం వెనుక కుట్ర దాగుందా ? అన్నది సీబీఐ దర్యాప్తులో తేలనుంది.
దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు. గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు.
ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.