Home » Tag » Baluchistan
అవసరాలు.. వ్యక్తులను గానీ, వ్యవస్థలను గానీ చివరకు దేశాలను గానీ దగ్గర చేస్తాయి. ఒక్కోసారి ఆ అవసరాలే శాశ్వత బంధం ఏర్పడేలా చేస్తాయి. పాకిస్తాన్ చైనా దశాబ్దాలుగా మిత్రదేశాలు. పాక్ అవసరం చైనా కంటే చైనా అవసరమే పాక్కు ఎక్కువగా ఉంటుంది. ఆధిపత్యం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే అలవాటు ఉన్న చైనా భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సహజంగానే పాక్కు మిత్రదేశంగా మారిపోయింది. పాక్ ఆర్థిక అవసరాలను తీర్చుతూ..ఆదేశానికి అవసరమైన నిధులను అప్పుల రూపంలో అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటూ వస్తోంది. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత చైనాకు పాక్ మరింత దగ్గరయ్యింది. అప్పటి నుంచి రెండు దేశాలు ఫ్రెండ్లీ నేషన్స్ గానే కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ప్రస్తుత పాక్ ప్రజల ఆలోచన మారుపోతోంది.