Home » Tag » Bandla Ganesh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కొత్త రికార్డ్ సెట్ చేసింది.
పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యసనం అని మైక్ దొరికితే రెచ్చిపోయే బండ్ల గణేష్‌కు.. ఆయన పేరు చెప్తేనే పూనకాలు వచ్చేస్తుంటాయ్.
కొద్దిరోజులుగా సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మరోసారి బండ్ల గణేష్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.. ఇప్పటికే ఓ చెక్ బౌన్స్ కేసులో ఓ సంవత్సర కాలం జైలు శిక్ష పడగా.. ఇప్పుడు ఇల్లు కబ్జా వివాదాంలో ఇరుక్కున్నాడు..
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు AMM కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నాలుగేళ్ళ క్రితం 95 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా.... చెక్కులు బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది.
నెలరోజుల పాలనపై రేవంత్ మీద బండ్ల గుప్పించిన ప్రశంసలు వింటే మనోడి మసాజ్ మాములుగా లేదుగా.. పిసుకుడే పిసుకుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్సీ కోసం రేవంత్‌తో సహా పార్టీ సీనియర్లను దగ్గర చేసుకునేందుకు బండ్ల మోగిస్తున్న మోత అంతా ఇంతా కాదు.
కళాకారుల కోటాలో బండ్ల గణేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇలాంటి వార్తలు రాజకీయ వర్గాల్లో వస్తున్న నేపథ్యంలో.. సీఎంతో బండ్ల గణేష్ భేటీ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా నటునిగా, నిర్మాతగానే కాక కాంగ్రెస్ సీజనల్ పొలిటిషన్‌గా బండ్ల గణేష్‌కు చాలా పేరుంది. ప్రతిసారి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ వాదిగా హల్చల్ చేస్తూ ఉంటారు.
రేవంత్‌రెడ్డికి వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ గెలుపుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని చెబుతున్నాడు గణేష్. రేవంత్‌కి ఇక్కడ చాలా మంది విలన్లు వున్నారని.. ఆయన్ని జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు గణేష్.
ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని.. కానీ తాను మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎంతగానో సహకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఐటీ వర్గాలు చేపట్టిన ర్యాలీలో బండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భగా చంద్రబాబుకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తనను ఎంతో బాధించిందన్నారు. ఈ బాధతో తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదన్నారు.