Home » Tag » bangladesh
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది.
'స్నేహమా, సమరమా? ఏదో ఒకటి తేల్చుకోండి'. హిందువులపై దాడులు, భారత వ్యతిరేక అజెండాతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్కు ఇటీవల జైశంకర్ ఇచ్చిన చివరి ఆప్షన్ ఇది. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొపీడీలు.. ఒక్కటేంటి మాటల్లో చెప్పలేని నరకం అనుభవిస్తున్నారు.
పాకిస్తాన్.. ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకూ.. అది చేయని నాన్సెన్స్ అంటూ ఏదీలేదు. ఈ విషయం తెలుసుకాబట్టే చాలా దేశాలు పాకిస్తాన్ను విలన్గా చూస్తాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సారి ఆతిథ్య పాకిస్తాన్ ఎదుర్కొన్న విమర్శలు మరే జట్టుకూ గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. ఒకవైపు టోర్నీ నిర్వహణలో సమస్యలు, మరోవైపు పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.
టర్కీ.. అన్నంపెట్టినోడిని సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా. 2023లో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ, ఆ సాయాన్ని మరచి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా... గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టనుంది.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
టీ ట్వంటీ క్రికెట్ అంటేనే అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అడ్రస్... గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు గెలవొచ్చు.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది.
ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం.. ప్రజలకు తిండిపెట్టే పరిస్థితి ఆ ఇద్దరికీ లేదు. జనం తిప్పలు పడుతున్నా పట్టింపూ ఉండదు. కానీ, అత్యాధునిక యుద్ధ విమానాలపై ఇద్దరి కన్నూ పడింది.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ పై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి బౌలింగ్ పై లైఫ్ టైం వేటు వేసింది. ఫలితంగా షకీబుల్ హసన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేసే అవకాశం లేదు.