Home » Tag » Banking Sector
చేసే పని ప్యాషన్‌తో చేయాలి కానీ సక్సెస్ మన వెనక కుక్కపిల్లా వచ్చేస్తుంది. ఇష్టం లేకుండా ఎన్ని లక్షలు వచ్చే జాబ్ చేసినా.. అది మెకానికల్గానే ఉంటుంది.
బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు తీపి కబురు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వేతనాల పెంపుతో పాటూ, వారానికి ఐదు రోజుల పనిదినాల అంశంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపి ఆర్బీఐ ఒక ప్రకటన వెలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఎన్నో దశాబ్ధాలుగా ఉన్న మన దేశం పేరును భారత్ గా మార్చడం వల్ల దేశంలోని సామాన్యుడి నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ చాలా రకాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రస్తుతం మనదంతా ఆన్లైన్ యుగమే నడుస్తోంది. ఏ సైట్ చూసినా డాట్ ఇన్ అనే అక్షరాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్ల కొన్ని సైట్లపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్షణ, బ్యాంకింగ్ రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
ఐడియా నచ్చకపోతే.. జియో.. జియో నచ్చకపోతే ఎయిర్ టెల్.. అది కూడా నచ్చక పోతే మరో టెలికాం ప్రొవైడర్.. ఇలా వినియోగదారులకు తమకు నచ్చిన టెలికాం ప్రొవైడర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉన్నట్టే క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డు వినియోగదారుల కూడా తమకు కావాల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకే అవకాశాన్ని కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
క్రెడిట్ కార్డు అంటేనే చేతిలో ఆస్తి ఉన్నంత ఆనందం. దీనిని సక్రమంగా వినోయోగిస్తే బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉంటుంది. అదే సరైన దారిలో ఉపయోగించకుండా డ్యూ గడువులు దాటవేసే కొద్దీ దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ సంస్థల నుంచి ఆదాయానికి చెక్ పడుతుంది. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఇది కేవలం ఏప్రిల్ మాసానికి చెందిన లెక్కలు మాత్రమే. రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అసలు ఇంత స్థాయిలో రుణాలు చెల్లించేలా పరిస్థితి ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.