Home » Tag » banks
ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ వాడే వినియోగదారులు మిగతా 32 బ్యాంకుల నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సూచించింది.
వాడకుండా ఉన్న ఖాతాలపై పెనాల్టీ వేయకూడదు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్, ఈమెయిల్స్ వంటివి పంపించి, వారికి ఈ విషయం తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారుల నుంచి స్పందన లేకపోతే.. అకౌంట్లోని నామినీలకు సమాచారం అందించాలి.
ఇంకా ఎవరి దగ్గరయినా 2వేల రూపాయల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవడం బెటర్. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టిన సెప్టెంబరు 30 డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
కరోనా సమయంలో గృహరుణ వడ్డీరేట్లు బాగా తగ్గాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచుకుంటూ పోయింది. దాని ప్రభావం గృహరుణ వినియోగదారులపై గట్టిగానే పడింది. ఈఐఎం ఒక్కసారిగా పెరిగిపోయింది
మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ...? ఖచ్చితంగా లేవు... పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా...? లేదు... అందరికీ ఒకటే ధర... అన్నింటికీ ఒకటే ధర.
వారం రోజుల్లోనే రూ.36 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వచ్చి చేరినట్లు అంచనా. డిపాజిట్లు లేదా మార్పిడి పేరుతో నోట్లు బ్యాంకులకు చేరాయి. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గత నెల 26 నాటికి దేశంలో మొత్తం రూ.34.4 లక్షల కరెన్సీ చెలామణిలో ఉంది.
చాలా మంది తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అర్జెంటుగా నోట్లు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతామేమో అని కంగారు పడుతున్నారు. నిజానికి అంత కంగారు అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.