Home » Tag » Basavaraj Bommai
కర్ణాటకలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ క్యూ కట్టారు. వృద్దులు, యువ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
కర్ణాటక ఎన్నికలకు ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది దేశమంతా ! మళ్లీ ఓడిపోతో ఉనికి కోల్పోతామన్న భయంతో ఓ పార్టీ చేస్తున్న పోరాటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని మరో పార్టీ ఆరాటం.. కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయ్. కర్ణాటక ఎన్నికలు.. పక్క రాష్ట్రాల రాజకీయాలను, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయ్. అందుకే ఇప్పుడు దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది.
కర్నాటక రాజకీయం రణరంగంగాా మారనుందా.
కర్నాటకలో ఎన్నికలు రోజు రోజుకూ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు సామ దాన బేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులే ఉండటంతో ప్రచారం స్పీడ్ పెంచాయి. ఎలాగైనా పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ హై కమాండ్లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.
కర్ణాటక రాజకీయాలు తెలంగాణ ముఖచిత్రాన్ని మారుస్తాయా.
కర్ణాటకలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక
ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.
'నందిని' బ్రాండ్ కర్ణాటకకు చెందినది అయితే.. అమూల్ బ్రాండ్ గుజరాత్ కంపెనీది. అసలే ఎన్నికల వేడితో కర్ణాటక ఉడుకుతున్న వేళ తాము కర్ణాటకలో వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు అమూల్ బ్రాండ్ ప్రకటించడం దీనంతటికీ కారణమైంది.
కర్ణాటకలో( Karnataka) కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) తెలివిగా చెక్ పెట్టింది పార్టీ హైకమాండ్. అంతా నీ చేతుల మీదుగా అంటూనే ఆయన చేతులు కట్టేసింది. పార్టీకి పాజిటివ్ వేవ్ ఉన్న సమయంలో మరోసారి గెలిచి సీఎం సీటుపై కూర్చోవాలనుకున్న సిద్ధూకు పరాభవం తప్పేలా లేదు.
కర్నాటకలో బీజేపీ పరిస్థితి ఏమంత గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది నేతలు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు స్వచ్చంధంగా విరమణ పాటిస్తున్నారు. మరికొందరు రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అనేక సమస్యలు కర్నాటక బీజేపీని వేధిస్తున్నాయి.