Home » Tag » BC DECLARATION
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని చెప్పింది. వేల కోట్లు ఖర్చు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామంటూ హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. బీసీల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది..?
కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు.
రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించారు. బీసీ సంక్షేమశాఖను పూర్తి మంత్రిత్వ శాఖగా మార్చి.. బీసీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో బీసీల వివాదం చిలికి చిలిక గాలివానలా మారే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఆ పార్టీ ఉదయ్‌పూర్ లో ప్రకటించిన డిక్లరేషన్. ఇది తెలంగాణలో అమలు కావడం లేదంటూ పట్టుబడుతున్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీ ఓటు బ్యాంకు కీలకం. బీసీలు ఎటువైపు మొగ్గితే అటువైపు విజయం తథ్యం. అందుకే బీసీలకు అధిక సీట్లు ఇవ్వడంతోపాటు, ఇతర పథకాల్ని కూడా కాంగ్రెస్ ప్రకటించబోతుంది.