Home » Tag » bcci
ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాటర్ల వైఫల్యంతో షాక్ తిన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. గత కొన్ని సిరీస్ లుగా వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ ను నియమించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక సస్పెన్స్ కు తెరపడింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించేందుకు ఒప్పుకున్న పాకిస్థాన్, భారత్ తో మ్యాచ్ ల కోసం యూఏఈని వేదికగా ఫైనల్ చేసింది. దీనికి సంబంధించి ఐసీసీతో తుది చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు... ఎటు చూసినా కాసుల వర్షమే... ఇటు స్పాన్సర్లు, అటు ఐపీఎల్ , మరోవైపు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం.. ఎప్పటికప్పుడు బీసీసీఐ రెవెన్యూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే హైబ్రిడ్ మోడల్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రెండు వేదికల్లో మెగా టోర్నీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనుండగా.. మిగిలిన దేశాల మ్యాచ్ లన్నీ పాకిస్థాన్ లో జరగనున్నాయి.
స్నేహితుల మధ్య మనస్పర్థలు అపార్థాల వల్లనే వస్తాయి.. భారత క్రికెట్ లో స్కూల్ స్థాయి నుంచే మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ స్థాయిలోనూ తమ స్నేహాన్ని కొనసాగించారు.
ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ముందు పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన డిమాండ్లు చేస్తున్న పీసీబీకి బీసీసీఐ, ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చాయి.
అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే... అది ఆటలోనైనా, అడ్మినిస్ట్రేషన్ లోనైనా భారత దే పైచేయి... దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్. , శశాంక్ మనోహర్ ఇలా ఎప్పటికప్పుడు బీసీసీఐ ప్రముఖులంతా ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి భారత క్రికెట్ బోర్డు హవా మొదలైంది.
ప్రపంచ క్రికెట్ లో భారత్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది. ఆటలోనే కాదు ఐసీసీని శాసించే విషయంలోనూ మనదే పైచేయి.. ఎందుకంటే బీసీసీఐ నుంచే ఐసీసీకి అత్యధిక ఆదాయం వస్తోంది. మన జట్టు ఎక్కడ ఆడినా ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా కాసుల వర్షమే..
ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ ఇంకా తేలలేదు. ఈ విషయంలో భారత్ పాకిస్థాన్ తగ్గేదెలా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు ఫైనల్ మీటింగ్ 29న జరగనుంది.