Home » Tag » Ben Stokes
కొత్త ఏడాదిలో భారత్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కావడంతో ఇంగ్లాండ్ సెలక్టర్లు దాదాపు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేశారు.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విధానంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాయింట్స్ సిస్టమ్ తనకు ఏరోజూ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పనికిమాలిన విధానంగా కనిపిస్తోందంటూ సెటైర్లు వేశాడు.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. బెన్ స్టోక్స్, పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌లోనే అతని ఇంట్లో దొంగలు పడ్డారు.. స్టోక్స్ ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలు.. విలువైన ఆభరణాలు, డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు.
రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. రాజ్ కోట్ పిచ్ పై పేస్ ఎటాక్ తో బరిలోకి దిగుతోంది. మూడో టెస్టుకు ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఆడింది.
మూడో టెస్టుకు దాదాపు పది రోజుల సమయం ఉంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ పది రోజుల టైమ్‌లో ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అలాగే.. మూడో టెస్టు కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
తమను ట్రోల్ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు ఆటగాళ్లు. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో అదే పని చేశాడు.
124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ కావడం విశేషం. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌటైన విధానం తీవ్ర వివాదస్పదం అవుతుంది. ఇదే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.