Home » Tag » Best Bowlers
భారత్ ధాటికి లంకేయులు విలవిలలాడారు
ఐపీఎల్ సీజన్ 2023లో ముంబాయ్ జోరు పెంచి ఆట ప్రదర్శిస్తుంది.
ఐపీఎల్ క్రికెట్ లో ప్రతి జట్టు తన సత్తా చూపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వరుస పరాజయాలను చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తమ IPL 2023 మ్యాచ్‌లో టేబుల్-టాపర్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడడమే కాకుండా, తిరిగి పుంజుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే మూడు విజయాలతో దూసుకుపోతోంది.
ఐ పి ఎల్ 2023 కోసం మొదటిసారి చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సి ఎస్ కె మీద రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే చెన్నై ఇప్పుడు ఏడు గేమ్‌లలో ఐదు విజయాలతో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలై తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అయితే వరుసగా సాధించిన రెండు విజయాలు తమ వైభవాన్ని మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చాయి. అజింక్య రహానే CSK తరపున అరంగేట్రం చేసి 19 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు, ఇది ప్రస్తుతం జరుగుతున్న IPL ఎడిషన్‌లో అత్యంత వేగవంతమైనది.
ఆర్ సి బి జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో, మరియు సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోచ్‌గా ఉంది. ఆట యొక్క క్రమాన్ని నిర్ణయించే విషయానికి వస్తే ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది. జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఫాఫ్, కోహ్లీ ఉంటారని అంచనా. ఆర్ సి బి నేటి మ్యాచులో గెలిస్తే ఐదవ స్థానం నుండి 3 వ స్థానంలోకి వస్తుంది.
ఈరోజు జరగబోయే RCB , KKR మధ్య మ్యాచ్‌ని చూడటం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లో ఉన్నంత థ్రిల్‌ను ఇస్తుంది. IPL 2023లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఫాఫ్ దూకుడుకు, మరియు నితీష్ యొక్క స్ట్రాటజీలకు మధ్య హోరాహోరీ మ్యాచ్ కి రంగం సిద్దమైంది.
ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని RCB నేటి మ్యాచ్‌లో నైట్ రైడర్స్‌ను ఓడించినట్లయితే మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశిస్తుంది. మూడు సార్లు IPL ఫైనలిస్టులుగా పేరున్న ఆర్ సి బి, ఈ సీజన్లో ఎనిమిది పాయింట్లతో, పట్టికలో ఐదవ స్థానంలో ఉన్నారు. బెంగళూరులోని ఇదే వేదికపై గతంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్ సి బి, రాజస్థాన్ రాయల్స్ ని ఏడు పరుగుల తేడాతో ఓడించింది.
ఛాలెంజర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది, మరియు వారి సొంత గ్రౌండ్ ఐన బెంగళూరు వారికీ బాగా కలిసొచ్చే ప్రాంతం. మరోవైపు KKR బౌలర్లు అత్యుత్తమ ఫామ్‌లో లేరు, ఇది ఆల్రెడీ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లకు క్యాష్ చేసుకునే అవకాశం. టాస్ గెలిచిన తర్వాత మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు సులువుగా మారే అవకాశం ఉంటుంది. ఛేజింగ్ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ అని క్రికెట్ వర్గం కోడై కూస్తుంది.