Home » Tag » BGT
టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. గంభీర్ ప్రధాన కోచ్ గా వచ్చినప్పటి నుంచి మన బ్యాటింగ్ ఘోరంగా విఫలమవుతోంది. బౌలింగ్ లో రాణిస్తున్నా బ్యాటింగ్ లో చేతులెత్తేస్తున్నారు.
ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సత్తా చాటిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు.
భారత క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకివ్వబోతోంది..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతో సీరియస్ గా ఉన్న బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది..ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పలు ప్రతిపాదనలపై చర్చించింది.
కొత్త ఏడాదిలో టీమిండియా ఫ్యాన్స్ కు షాక్ తగలబోతోందా... భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా... అంటే అవుననే అనుమానాలు మొదలయ్యాయి.
కొత్త ఏడాదిలో టీమిండియా ఆడబోయే మెగాటోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ... ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా టోర్నీ జరగనుండగా... భారత్ ఆడే మ్యాచ్ లకు ఎడారిదేశం ఆతిథ్యమిస్తోంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై బెంగాల్ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు.
గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి నిరాశే మిగిల్చింది. ఒక్క టీ ట్వంటీ ప్రపంచకప్ తప్పిస్తే మిగిలిన సిరీస్ లలో రన్ మెషీన్ కు అలుపొచ్చింది... ఒక్క సిరీస్ లోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయాడు. పరుగుల యంత్రంగా పిలుచుకునే విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు రాలేదు.
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్... ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. భారత పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్న బుమ్రా ఇటీవల సిడ్నీ టెస్ట్ సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి జోష్ లో ఉన్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు గాయమైంది.
పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్న భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగజారారు. తాజాగా విడుదలైన జాబితాలో వీరిద్దరూ తమ కరీర్ లోనే అత్యంత చెత్త స్థానాల్లో నిలిచారు.