Home » Tag » Bharatiya Janata Party
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ స్లోగన్ తో ముందుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party). తాము అధికారంలోకి వస్తే బీసీ (BC) ని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. కానీ అది వర్కవుట్ కాలేదు. బీసీ నినాదాన్ని తెలంగాణ ఓటర్లు (Telangana Voters) పెద్దగా పట్టించుకోలేదు. ఆ పార్టీకి 8 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. దాంతో పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) ఈ సారి ట్రాక్ మార్చేసింది కమలం పార్టీ.
టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు బిజెపి (BJP) తో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేసారు. రేపో మాపో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) వాటాగా కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయడమే ఇక ఆలస్యం. చంద్రబాబు (Chandrababu) నిర్ణయం పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకుంటూ, పార్టీని నమ్ముకుంటూ అష్ట కష్టాలు పడి ఎన్నికల వరకు వస్తే… ఇప్పుడు చంద్రబాబు వెళ్లి 8 ఎంపీ సీట్లు బిజెపికి ఇస్తానని చెబుతూ...ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టిడిపిలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కర్ణాటక ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి. బీఆర్ఎస్, కేసీఆర్ను ఢీకొట్టి.. కమలం సత్తా ఏంటో చూపిస్తామని భావించిన కాషాయం పార్టీ నేతలకు.. వరుస పరిణామాలు కషాయం మింగినట్లు చేస్తున్నాయి.