Home » Tag » Bhaskar Reddy
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కోడి కత్తి కేసులో కాస్తలో మిస్ అయ్యాం అనుకుంటుంటే.. వైఎస్ వివేకా కేసు ఇప్పుడు వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం.. ఆయన చుట్టూ కూడా సీబీఐ ఉచ్చు బిగిస్తుండడంతో.. జగన్‌కు టెన్షన్ మొదలైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు.
ఏపీలో రెండు హై ప్రొఫైల్ కేసులు నాలుగేళ్లుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి కోడి కత్తి కేసు.. రెండోది వివేకా హత్య కేసు. రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన ఈ రెండు కేసులు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది. ఇక కోడి కత్తి కేసు కూడా అంతే. జగన్‌పై హత్యాయత్నంగా నమోదైన ఈ కేసు ఇంకా ఏమీ తేలకుండానే మిగిలిపోయింది. అసలు ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ కేసుల విషయంలో రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుతోపాటు వివేకా హత్య కేసు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఓ వీడని చిక్కుముడిలా మారింది. కేసు కొలిక్కి వచ్చింది అనుకున్న ప్రతీసారి ఓ కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పటికే చాలా కారణాలు మారిపోగా ఇప్పుడు మరో కొత్త కోణాన్ని కోర్టులో వ్యక్తపరిచారు భాస్కర్ రెడ్డి తరఫు లాయర్. నిందుతుల్లో ఒకడైన సునీల్ యాదవ్ తల్లిన వివేకా లైగింకంగా వేధించాడని.. ఆ కక్షతోనే సునీల్ యాదవ్ వివేకాను హత్య చేశాడని చెప్పారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చి చేరింది.