Home » Tag » BJP President
అన్నామలై... తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు... ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.
ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) మధ్య విభేదాలు మరింత పెరిగాయా...? అంటే అవునన్న సమాధానమే వస్తోంది పార్టీ వర్గాల నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు ఎడ మొఖం పెడ మొఖంగానే ఉంటున్నారట. ఇటీవల బండి సంజయ్ (Bandi Sanjay) హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ... పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నిలకు (Parliament Elections) సమాయాత్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసిన అభ్యర్థుల్లో సగానికి సగం మంది ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. టెలిస్కోప్‌కు కూడా దొరక్కుండా తిరుగుతున్నారట. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి ఏమైనా పనికొస్తారేమోనని పార్టీ అగ్రనాయకత్వం చుక్కానీ పట్టుకు తిరుగుతున్నా... ఎక్కడా ఆచూకీ దొరకడం లేదన్నది ఇంటర్నల్ టాక్.
తెలంగాణ కమలం పార్టీలో (Telangana BJP Party) .. ఎంపీ సీట్ల కోసం పోటీ భారీగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాస్త అటు ఇటుగా ఉన్నా.. లోక్‌సభ సీట్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారట నాయకులు. ఆ ఎన్నికలకు, ఈ ఎలక్షన్స్‌కు ఈక్వేషన్స్ మారిపోతాయని.. ఇప్పుడు మోదీ ఇమేజ్ ప్లస్ అయి పార్లమెంట్ మెట్లు ఎక్కొచ్చని లెక్కలు చెబుతున్నారట నేతలు. అందుకే ఎంపీ టికెట్లకు పిచ్చ డిమాండ్ పెరుగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయ్.
తెలంగాణలో కమలం పార్టీ కట్టు తప్పిందా? పార్టీ సిద్ధాంతాలను డబ్బు డామినేట్ చేస్తోందా? దొరికినంత దండుకో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే బాపతు పెరిగిపోతోందా? అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా నేతలు అందినంత దోచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీలో ఇన్నేళ్ళలో లేనిది ఇప్పుడు కొత్తగా డబ్బు మూటల మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన బీజేపీలో వర్గపోరు.. ఫలితాల తర్వాత మరింత తీవ్రమైంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గురు నేతలకు చెందిన అనుచరులు.. కార్పొరేటర్లు, మాజీ లీడర్లు.. ఇలా ఎవరికి వారే విడిపోయారు. ఒకళ్ళ మీ మరొకరు వీడియోలు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ పోరు మరింత ముదిరితే.. బీజేపీకి వచ్చే ఆ ఒకట్రెండు ఎంపీ స్థానాలు కూడా రాకుండా పోయేలా ఉన్నాయి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినే కంటిన్యూ చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా కొనసాగాలని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులే టైమ్ ఉండటంతో.. ఈ టైమ్ లో అనవసరంగా రిస్క్ ఎందుకని కమలం పార్టీ భావించింది.
తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా.. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన బీజేపీ ఆఫీస్ కు వెళ్లనున్న ఎమ్మెల్యేలు..
తెలంగాణలో మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలవాలని జనసేన నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ అవ్వాలని నిర్ణయించింది. పొత్తుతో పాటు సీట్ల షేరింగ్ పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జనసేన మొదట 32 స్థానాల్లో నిలబడాలని అనుకుంది.
బండి సంజయ్ కి కమలంలో కీలక పదవి లభించింది.. మరి ఆయనకు కేంద్ర మంత్రి పదవి లేనట్టేనా..? అధ్యక్షుడిగా తప్పించిన ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇచ్చినట్టు..? ఇప్పట్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ లేనట్టేనా..?