Home » Tag » BRS Defeat
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా... లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) బీఆర్ఎస్ (BRS) ఓటమి తర్వాత.. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్. జాతీయ రాజకీయాల్లో (National Politics) చక్రం తిప్పుతానంటున్న గులాబీ అధినేత.. లోక్‌సభ బరిలో (Lok Sabha Elections) ఉండబోతున్నారా.. మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారా.. కేటీఆర్ (KTR) కూడా అదే దారిలో నడవబోతున్నారా..
పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన.. కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరతాడంటూ బలంగా నమ్మిన జనం... ఢిల్లీతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చింది నేనే.... తెలంగాణను కూడా నేనే అభివృద్ధి చేస్తానంటూ పదే పదే చెప్పిన కేసీఆర్. ఇంత అనుకూలతలున్న బీఆర్ఎస్ ఎందుకు ఓడింది ?. బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అంశాలేంటి..?
రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటి.. కాంగ్రెస్‌ను ఆరు గ్యారంటీలే గెలిపించాయా అనే సంగతి పక్కన పెడితే.. ఫైనల్‌గా బీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. ఓటర్లు ఎలాంటి కన్ఫ్యూజన్లో కనిపించలేదు.
కర్నె శిరీష.. అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె గెలవాలని చాలామంది కోరుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు బర్రెలక్కకు ఆర్థిక సాయం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5 వేల 754 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోయి.. నాలుగో స్థానంలో నిలిచినా.. మనసులు గెలుచుకున్నావంటూ నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. నిరుద్యోగుల వాయిస్ వినిపించడానికి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటోంది బర్రెలక్క.
ఎవరు గెలుస్తారు.. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. మహా సస్పెన్స్‌కు ఫుల్స్పాట్ పడింది. హస్తం చేతుల్లోకి తెలంగాణ వెళ్లిపోయింది.
తెలంగాణ రిజల్ట్ డిసైడ్ అయ్యింది. ఆఖరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. భారీ ఆధిక్యంతో దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్ చేయడం కాదు కదా రీచ్ అవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కష్టంగానే మారింది. నిజానికి ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతోనే రిజల్ట్‌లో ఓ క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి కాంగ్రెస్ మెజార్టీ పెరుగుతూనే ఉంది.
చేసిన ప్రతీ పనికి ఫలితం దక్కుతుందని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఈ మాట ప్రతీ రంగానికి వర్తిస్తుంది.. చివరకు రాజకీయాలకు కూడా ! చేసిన ప్రతీ పనికి ఫలితం ఏదో ఒకరూపంలో కనిపిస్తూనే ఉంటుంది. మంచి చేస్తే మంచి.. ముంచే పనులు చూస్తే ముప్పు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. ఒక పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలోకి జంప్ చేసి.. తమ దశ తిరిగిపోయింది. ఇక తమకు తిరుగేలేదు అనుకునే వారికి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. అసలైన దారి చూపించాయ్. ఐదేళ్లు జనాలు మౌనంగా ఉండొచ్చు.. తమదైన రోజు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పకనే చెప్పారు.
తెలంగాణ వాళ్లు కేసీఆర్ ఓడిస్తే.. సీమాంధ్రులు బతికించారు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం.. KCR ఆంధ్ర వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేవారు.
తెలంగాణలో ఏ మూల చూసినా ఇప్పుడు ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఒకటే టాపిక్ వస్తోంది. గెలిచేది ఏ పార్టీ.. ఓడిపోయేది ఏ పార్టీ. ఈ ఎలక్షన్ నిరుడు లెక్క కాదు.. పక్కా వేరే లెక్క ఉంటది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు గెలిచినా.. మార్జిన్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా ఏదీ తేల్చలేకపోయాయంటే.. ఫైట్ ఏ రేంజ్‌తో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.