Home » Tag » BRS Manifesto
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం మరింత పెంచింది. నేటి నుంచి అధికారికంగా కేసీఆర్ ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది అని చెప్పవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్న పథకాలను మరింత పెంచుతూ మరో రెండు నూతన పథకాలు ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. 'ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో తయారు చేశాము'
అభ్యర్థులతో భేటీ అయిన కేసీఆర్.. పనిలో పనిగా పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు, మైనంపల్లి హ్యాండ్ ఇచ్చిన మల్కాజ్‌గిరికి అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు అంతా ! కట్ చేస్తే ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా.. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే చాన్స్ ఉందనే ప్రచారం కొత్తగా తెరమీదకు వచ్చింది.
2023 బీఆర్ఎస్ మేనిఫెస్టో లో ఎక్కువగా.. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, టార్గెట్ గా కేసీఆర్ గురి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైందని తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఎలక్షన్ సమరంలో గర్జించేందుకు సిద్ధం అవుతున్నారు. అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయి.. మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చి.. ఎన్నికల కదన రంగంలోకి పంపించనున్నారు కేసీఆర్.