Home » Tag » bse
మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ మూత పడింది. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు కూడా ఇవాళ మూతపడ్డాయి. BSE, NSE ల్లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. స్టాక్ మార్కెట్ మొత్తం సెలవు ఉంటుంది. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్, ACLBని కూడా మూసేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా క్లోజో చేశారు.
స్టాక్మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్లంటే భయపడే పరిస్థితి నెలకొంది. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు.
గతంలో ఎంతో ఉత్సాహంగా, ఆశగా మార్కెట్ల వైపు చూసిన ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇప్పుడు బాబోయ్ మాకొద్దీ మార్కెట్లు అంటున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లకు 38లక్షల మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు దూరమయ్యారంటే ఎంత భయం సృష్టించాయో అర్థం చేసుకోవచ్చు.