Home » Tag » bsp
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూర్‌లోని సదయప్పన్ స్ట్రీట్‌లోని తన నివాసంలో ఉండగా ఆరుగురు దుండగులు బైకులపై వచ్చి ఆయనను నరికి చంపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రవీణ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఆర్ఎస్పీ అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గులాబీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. సొంత తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ నుంచే ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఒప్పందం ప్రకారం.. బీఎస్పీ రెండు స్తానాల్లో పోటీ చేయనుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీనిలో భాగంగా బీఎస్పీ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) BRS ను ఓడగొట్టడంతో కారు షెడ్డుకు వెళ్ళిపోయింది. అందుకే కొత్త ఫ్రెండ్స్ ని వెతుక్కొని ఆ కారును మళ్లీ జనంలోకి తేవాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు BSP ఉనికినే పట్టించుకోలేదు. అలాంటిది ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులకు కూడా రాయబారం పంపుతున్నారు.
అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అంటారు. అధికారం పోగొట్టుకున్న తర్వాత కేసీఆర్ (KCR) వైభవం ఎలా దిగజారిపోయిందో స్పష్టంగా బయటపడింది. BRS ఇప్పుడు బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద భారీగా పడేలా కనిపిస్తోంది. పొత్తు ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆదిలాబాద్‌లో కీలక నేతలంతా.. కారుకు, సారుకు బైబై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఈ లిస్ట్‌లో ఉండడం.. గులాబీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది.
హైదరాబాద్‌లోని నివాసంలో కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై చర్చించారు. కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎవరు.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో రాజకీయం రసవంతంగా ఉంది. పోటాపోటీగా సభలు సమావేశాలు. మాటల.. తూటాలు.. చేసుకుంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో చాలామంది కాంగ్రెస్ వైపే ఉన్నా.. బీఎస్పీ కూడా కొన్ని వర్గాల ఓట్లు చీల్చుకుంటోంది. రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంక్‌నే చీలిక వచ్చే ఛాన్సుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల.. అది పరోక్షంగా అధికారపార్టీ బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశముంది.
3 కోట్ల బహుజన బిడ్డలు డబ్బులు ఇచ్చి మన రాజ్యం రావాలి కొట్లాడంది అంటున్నారు. వేములవాడలో ఆ దొర పోతే ఈ దొరలు వస్తున్నారు. బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు. వట్టే జానయ్యపై దాడి చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరు బహుజన బిడ్డలు ఏకం కావాలి.