Home » Tag » Bus Yathra
తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఒకరు నిజం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేపడుతుంటే.. మరోకరు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్నారు. నిజం గెలుస్తుందా.. సామాజిక న్యాయం గెలుస్తుందా తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అలా విడుదలైందో లేదో భవిష్యత్ కార్యచరణను రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే రాహూల్ గాంధీ సహా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నారా భువనేశ్వరి కుప్పం నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విరాలు ఇప్పుడు చూద్దాం.
వ్యక్తులుగా ఎవరికి వారు చేసే పాదయాత్రల కంటే ఐక్యంగా అందరూ చేసే బస్సు యాత్ర ద్వారా అధికారానికి దగ్గరవ్వొచ్చని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో సీనియర్ నేతలంగా కలిసి ఐక్యంగా బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.