Home » Tag » BUS YATRA
సభలకు లక్షల్లో జనాలు.. బస్సు వెనక పరిగెత్తుకు వచ్చిన అభిమానులు.. సోషల్ మీడియాలో అనుకూలంగా వీడియోలు.. వీటన్నింటి మధ్యలో వైనాట్ 175 అని నినాదాలు.. కట్ చేస్తే 11 సీట్లకు పరిమితం. ఇదీ ఈ ఎన్నికల్లో వైసీపీ, జగన్ ప్రయాణం.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఊపందుకోంటుంది.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రథసారథి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించిన TRS - BRS పార్టీ అధినేత.. తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. గతంలో ఎప్పుడు చేయని ప్రచారం కు సిద్దం అవుతున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ..
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారనికి సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తేదీ నుంచి చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) పట్టుమని నెల రోజులు కూడా లేవు. ఒక వైపు వైసీపీ (YCP) అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్ధం సభలు పూర్తిచేసి... బస్సు యాత్రతో మేమంతా సిద్ధమంటూ నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నాడు. 74 ఏళ్ళ చంద్రబాబు (Chandrababu) రోజుకి మూడు సభలు పెట్టి... 44 డిగ్రీలు ఎండలో కూడా అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడు.
ఇదీ పరిస్థితి. కడప (Kadapa) జిల్లా నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతీచోట వివేకా కూతురు సునీతతో కలిసి.. హత్య కేసును హైలైట్ చేస్తున్న షర్మిల.. అవినాశే హంతకుడని.. ఆ హంతకుడిని జగన్ కాపాడుతున్నాడని.. అందుకే కుటుంబానికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ.. చెప్తున్నారు. షర్మిల బస్సు యాత్రలకు జనాలు కూడా వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ పార్టీ (YSR Party) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వం ఎండగడుతూ.. వైసీపీ సామాజిక సాధికార (YCP Social Empowerment) బస్సు యాత్ర (Bus Yatra) నిర్వహించిన విషయం తెలిసిందే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. ఓ పక్క సంక్షేమ హామీలు, మరోపక్క పార్టీలో చేరికలతో రోజు రోజుకూ బలం పెంచుకుంటోంది. ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి బస్సు యాత్ర నిర్వహించబోతోంది.
యాత్ర ప్రారంభం రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ టూర్ కొండగట్టు నుంచి ప్రారంభించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.
త్వరలో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల నుంచే కాంగ్రెస్.. బస్సు యాత్రలు ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ఈ బస్స యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు.