Home » Tag » Campaingns
సొసైటీపై సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. చాలా మంది తమ రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఒకప్పుడు ఎదైనా వార్త ఎవరకైనా చేరవేయాలంటే చాలా టైం పట్టేది. టీవీలో వస్తేనే ఆ వార్త ప్రజలకు చేరేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎలాంటి వార్తైనా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. వందల్లో న్యూస్ యాప్స్, వేలల్లో వెబ్ చానల్స్ వచ్చాయి. ఇవి చాలవన్నట్టు పొలిటీషియన్స్ ఎవరికి వారు పర్సనల్ పేజ్‌లు మెయిన్టేన్ చేస్తున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రజలకు టచ్‌లో ఉంటున్నారు. అంతే కాదు ఏ ఏయాకు ఆ ఏరియా ప్రజలను టార్గెట్‌గా పెట్టుకుని వాట్సాప్ గ్రూపులు మెయిన్టేన్ చేస్తున్నారు. వాళ్లు చెప్పాలి అనుకున్న విషయాన్ని క్షణాల్లో కార్యకర్తలకు చేరవేస్తున్నారు.