Home » Tag » Cantonment MLA
దర్గా నుంచి వెళ్లిన తర్వాత ప్రమాద ఘటనకు మధ్యలో.. ఆ ఐదు గంటలు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయ్. లాస్య మరణం వెనక ఏం జరిగింది.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి..?
అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంత కుమారికి సూచించారు. గతేడాది ఇదే నెలలో లాస్య తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) కారు ప్రమాదంలో (Road Accident) చనిపోవడంతో కుటుంబసభ్యులు షాక్ లో ఉన్నారు. ఏడాదిగా ఆ కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. 2023 ఫిబ్రవరి 19 నాడు సాయన్న అనారోగ్యంతో చనిపోయారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) మృతి తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే లాస్య చనిపోయవడం అత్యంత విషాదంగా మారింది. సరిగ్గా గతేడాది ఇదే నెలలో.. లాస్య తండ్రి, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) కూడా చనిపోయారు.
కారు ప్రమాదంలో కంటోన్మెంట్ MLA (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలో నింపింది. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ఆమె ప్రయాణించడమే ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే... ముందు సీటుకు నందిత వేగంగా ఢీకొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కంటోన్మెంట్ ఎమ్మెల్యే (Cantonment MLA) లాస్య నందిత (Lasya Nandita) ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయారు. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ (ORR) పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో లాస్య అక్కడిక్కడే చనిపోయారు.