Home » Tag » CBI Enquiry
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రక్తపు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ జూన్ 18న చనిపోయాడు. అతని మరణంతో మృతుల సంఖ్య 292కు చేరింది. వందల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. చరిత్ర మర్చిపోలేని ఈ దుర్ఘటనపై సీబీఐ జూన్ 6న విచారణ ప్రారంభించింది.
వివేకా హత్య కేసు రకరకాల మలుపు తీసుకుంటోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనే ప్రశ్న చుట్టే తిరగుతోంది కేసు మొత్తం.
సీబీఐ.. దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటి. కేసు ఏదైనా.. నేరం ఎలాంటిదైనా.. రాష్ట్రం పరిధి దాటి సీబీఐ చేతుల్లోకి వెళ్లిందంటే.. అతి తక్కువ సమయంలో అంతు చూస్తారనే పేరు ఉంది. ఐతే ఇదంతా ఒకప్పుడు ! సీబీఐ రోజురోజుకు అభాసుపాలవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు.. సీబీఐని రాజకీయం కోసం వాడుకుంటున్నాయని.. సీబీఐని రాజకీయాలు కమ్మేశాయని.. పంజరంలో చిలకలా సీబీఐ మారిందనే విమర్శలు ఉన్నాయ్.
వివేకానంద రెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్తున్నారు సీబీఐ అధికారులు.
వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు. తమ మెడకు చుట్టుకుంటోందని భావించే ఇప్పుడు వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో మొదటిరోజు విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
సీబీఐని ప్రబావితం చేసేంత స్థాయి చంద్రబాబుకు ఉందంటే ఎవరూ నమ్మరు. వైసీపీకి మాత్రమే ఆ సత్తా ఉంది. అయినా ఇంటిగుట్టు బయటపడిపోతుందనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందని అర్థమవుతోంది. వివేకా హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.