Home » Tag » CBN
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ళుగా ఫేక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా నుంచి కొన్ని.... ఆ పార్టీ అభిమానులు మరికొన్ని... ఇలా ఏది రియలో... ఏది ఫేకో అర్థం కాక జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా... ఇంకా ఫేక్ వీడియోల బాధ తప్పడం లేదు. ఇప్పటికీ వైసీపీ నుంచి వస్తున్న ఇమేజెస్, వీడియోలకు కౌంటర్ ఇస్తూ... ఇంకా ఎన్నాళ్ళీ ఫేక్ బతుకులు... ఇది ఫేక్ రా సామీ అంటూ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీడియా పోస్టులు చేస్తూనే ఉంది.
స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఇప్పటికే డిసైడ్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు... డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా పెట్టడం వెనుక బాబు స్కెచ్ మామూలుగా లేదన్న టాక్ నడుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన మౌనం దేనికి సంకేతం? పోలింగ్ ముగిసి ఇన్ని రోజులైనా.... తన సహజ శైలికి భిన్నంగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. మనం గెలుస్తున్నామన్న నమ్మకమా? లేక ఎక్కడో తేడా కొడుతోందన్న భయమా? అసలు చంద్రబాబు మౌనం వెనుక ఏముంది
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే... మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయనకు రాజకీయాలే జీవితం. నిత్యం రాజకీయాలే ఆలోచనగా.. ఊపిరిగా ఉండే చంద్రబాబు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు. జైలు నుంచి రీలిజ్ అయ్యాక వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తన ఇంట్లో యాగాలు.. హోమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు ఎందుకు ఆధ్యాత్మిక బాట ఎందుకు పట్టారు..? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ లభించి చంద్రబాబుకు కాస్త ఊరట కలిగింది. కానీ ఏపీ ప్రభుత్వం పెట్టిన మరికొన్ని కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు కేసులపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయ్. ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ వెల్లడించింది. అయితే అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి..? చంద్రబాబు ప్రమేయం ఏంటి..?
టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను అమరావతి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు పదేపదే కుప్పం ఎందుకు వెళ్తున్నారు..? ప్రతి రెండు నెలలకోసారి కుప్పంలో ఎందుకు పర్యటిస్తున్నారు..? కంచుకోటలో ఓడిపోతానని బాబు భయపడుతున్నారా..? బాబుకు కుప్పం భయం ఎందుకిలా పట్టుకుంది..?