Home » Tag » Central Vista
దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ నిర్మాణమే సెంట్రల్ విస్తా. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందంగా, రమణీయంగా నిర్మించారు. సెప్టెంబర్ 19న తొలి అడుగు పెట్టి సమావేశాన్నిజరుపుకోబోతున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుకున్నది ఒకటి.. పాలక పక్షం చేస్తోంది ఒకటి అన్న విధంగా జరుగనున్నాయా అంటే.. తాజాగా విడుదల చేసిన బులిటెన్ చూసిన తరువాత అవుననే చెప్పాలి. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందో ఈ క్రింది అంశాలను ఒకసారి చదవండి.
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్‌ను ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల నడుమ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేశారు. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ‘‘రాష్ట్రీయ జనతాదల్’’ కొత్త పార్లమెంట్ పై చేసిన ట్విటర్ పోస్ట్ ఇప్పుడు దుమారం లేపుతోంది.
నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండం. దేశ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన నాలుగు సింహాల రాజముద్ర మరో అద్భుతం అని చెప్పాలి.
ప్రత్యేక హంగులతో ఇంద్రభవనం తలపిస్తున్న నూతన పార్లమెంట్
దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో, 64,500 చదరపు మీటర్ల స్థలంలో దీన్ని నిర్మించారు. నాలుగు అంతస్థుల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల ఐదు నెలల 18 రోజులు పట్టింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైనర్ బిమల్ పటేల్ నూతన పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు.
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత అధునాతనమైన హంగులతో నిర్మించిన భవంతి సెంట్రల్ విస్తా. ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో కంటే కూడా అధిక మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లు ఏర్పాటు చేశారు.