Home » Tag » Century
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 183 పరుగులకే పరిమితమైంది.
ఏ ఫార్మాట్ లోనైనా ఆల్ రౌండర్ కు చాలా గుర్తింపు ఉంటుంది. ఈ కేటగిరీలో భారత్ నుంచి చాలా కాలంగా అదరగొడుతున్నది ఎవరంటే రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అన్ని ఫార్మాట్ లలోనూ దుమ్మురేపుతున్న జడేజా టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు.
భారత బౌలర్ల జోరుకు, జైస్వాల్ విధ్వంసకర సెంచరీ కూడా తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. మూడో రోజు లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జోరుకు అడ్డుకట్ట వేశారు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్ శతకంతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ 118 పరుగులతో సత్తాచాటాడు.
ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు వికెట్ కీపర్.. కేఎస్ భరత్ రాణించాడు.
టీమిండియాలో ఇప్పుడిప్పుడే తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు.
14 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. భారీ శతకంతో చెలరేగిన సౌమ్య.. ఐదేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకంతో చెలరేగాడు. చాలా రోజుల నుంచి పెద్దగా ఫామ్‌లో లేని వార్నర్ సరిగ్గా ప్రపంచకప్ ముందు సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 93 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు.
బార్బడోస్ రాయల్స్ తరపున ఆడుతున్న కార్న్‌వాల్, SKN పేట్రియాట్స్ పై 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే ఇదే కార్న్‌వాల్ టోర్నీలో మునుపటి మ్యాచ్‌లో మొదటి బంతికే రనౌట్ అయ్యాడు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. వెస్టిండీస్‌తో చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసాడు.